
రాజకీయ నాయకులకి బుద్ది చెఫ్ఫాలంటే, ఓటు అనే మహ శక్తివంతమయిన ఆయుధం తోనే కొట్టాలి కానీ ఇలా రాళ్ళు, చెప్పులు, గుడ్లుతో కానేకాదు.
ఇలాంటి రాజకీయనాయకులకి ఇలాగే బుద్ది చెప్పాలి అంటారా, సరే అలాఅయితే...కారణం చెప్పి రాళ్ళు విసురుదాం.
అవినీతి పందికొక్కులిని తిన్నది కక్కే వరకు,
ఏ పొలసీ లేకుండా పార్టీలు మారేవారిని మూర్చపోయేలా,
అధికారంలో ఉండప్పుడు ఒకరకంగా...ప్రతి పక్షంలో ఉండప్పుడు ఒకరకంగా మట్లాలడే ఊసరవిల్లులకి రంగు పడేలా, మతం, కులం, ప్రాంతం చెప్పి రెచ్చగొట్టేవారికి పిచ్చి పట్టేలా...
కారణం చెప్పి మరీ కొడదాం. అప్పుడు కానీసం వారికి చేసిన తప్పులయినా తెలుస్తాయి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతే...అందరూ కలిపి తొందరిలో మనకు పిచ్చి పట్టిస్తారు. అందరూ దొంగలే, దొంగ దొంగే, దానిలో మళ్ళీ మంచి దొంగ, చెడ్డ దొంగ ఏమిటి...కామిడీ గా...
ఏది ఏమయినా...ప్రజాసౌమ్యంలో ఇలా చేయకోడదు...మరి మీరేమంటారు? Say YES or NO.