Saturday, April 30, 2011

అవయవ, దేహ దానం.



చిరంజీవి, చంద్రబాబు ల పై రాళ్ళు, గుడ్లు విసరటం కరక్టేనా?

రాజకీయ నాయకులకి బుద్ది చెఫ్ఫాలంటే, ఓటు అనే మహ శక్తివంతమయిన ఆయుధం తోనే కొట్టాలి కానీ ఇలా రాళ్ళు, చెప్పులు, గుడ్లుతో కానేకాదు.

ఇలాంటి రాజకీయనాయకులకి ఇలాగే బుద్ది చెప్పాలి అంటారా, సరే అలాఅయితే...కారణం చెప్పి రాళ్ళు విసురుదాం.

అవినీతి పందికొక్కులిని తిన్నది కక్కే వరకు,
 ఏ పొలసీ లేకుండా పార్టీలు మారేవారిని మూర్చపోయేలా,
 అధికారంలో ఉండప్పుడు ఒకరకంగా...ప్రతి పక్షంలో ఉండప్పుడు ఒకరకంగా మట్లాలడే ఊసరవిల్లులకి రంగు పడేలా, మతం, కులం, ప్రాంతం చెప్పి రెచ్చగొట్టేవారికి పిచ్చి పట్టేలా...

కారణం చెప్పి మరీ కొడదాం. అప్పుడు కానీసం వారికి చేసిన తప్పులయినా తెలుస్తాయి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతే...అందరూ కలిపి తొందరిలో మనకు పిచ్చి పట్టిస్తారు. అందరూ దొంగలే, దొంగ దొంగే, దానిలో మళ్ళీ మంచి దొంగ, చెడ్డ దొంగ ఏమిటి...కామిడీ గా...

ఏది ఏమయినా...ప్రజాసౌమ్యంలో ఇలా చేయకోడదు...మరి మీరేమంటారు? Say YES or NO.

Sunday, April 17, 2011

బ్రాహ్మణుల మధ్య కూడా ప్రాంతీయచిచ్చు పెట్టిన కెసీర్, ఇది నీకు సబబేనా?

మెజారిటీ రాజకీయ నాయకులకి రెండే లక్ష్యాలు, ఒకటి పవర్, రెండు ధనధాహం. వీటికోసం ప్రజలను కులాలుగా, మతాలుగా, భాష మీదో విడగొడతారు, మీరు రొటీన్ కి  కొంచెం భిన్నంగా ప్రాంతీయవాదం తో విడగొట్టారు.

అవునులే మాకే తెలివి ఉంటే మీరు చెప్పే సొల్లు వింటూ ఇలా ఎందుకుంటాం, ఇవే పోరాటాలు మీ అవినీతిమీద చేసేవాళ్ళం, మిమ్ములందరనీ ఏ అండమాను దీవులుకో పంపేవాళ్ళం. విడగొట్టటాలు, వినాసనాలు చేయటం చాలా తేలిక, కానీ నిర్మిచటం, కలపటం చాలా కష్టం.

ఏది ఏమయినా బ్రాహ్మణుల మధ్య కూడా ప్రాంతీయచిచ్చు పెట్టి ప్రాంతీయపిచ్చి ఉన్నవాళ్ళ దృష్టిలో ఒక మెట్టు ఎక్కినా, చరిత్ర నిన్ను క్షమించదు. బ్రహ్మణులు అయిపోయారు, ఇక దేవుళ్ళే మిగిలి వున్నారు. వారికి కూడా ఏదొక ప్రాంతం అంటగట్టి భక్తుల మధ్య కూడా చిచ్చుపెట్టేయ్, అప్పుడయినా నీ కడుపు నిండుతుందేమో.  మరి మీరేమంటారు? Say YES or NO.

Poll Results:

Saturday, April 9, 2011

అవినీతి గూర్చి అవినీతి పరులే మాట్లాడటం హస్యాస్పదం కాదూ?

ఇదేనేమో దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో 99% అవినీతిమయం,  ఆ పార్టీలలో కనీసం 95% ప్రజాప్రతినిధులు అవినీతిమయం.

వారిలో కొంతమంది ఇప్పుడు ముందుకొచ్చి అవినీతిపై పోరులో అన్నాహజారే కి మద్దతు పలుకుతున్నారు. ఇది ఎంతవరకు నమ్మగలం, పోనీ ఇప్పుడు మారిపోయారు అనుకుందాం, ఇలా అయితే మళ్ళీ అవినీతి పరులుగా మారరని నమ్మేదెల? ఇలాంటి వాళ్ళని నమ్మటం అంటే మళ్ళీ పాములుకి పాలుపోయటమే. మరి మీరేమంటారు? Say YES or NO.

Poll Results:

Saturday, April 2, 2011

మన వ్యక్తిత్వమా లేక ఎదుటి మనిషి తత్వమా?

ఎదుటి మనిషి ఎలా ఉన్నా పరవాలేదు మన మనస్సు చెప్పినట్లు నదుచుకోవటమా? లేక ఎదుటి మనిషిని బట్టి నడుచుకోవటమా అనేది నాకు ఎప్పుడూ ఎదురయ్యే మరో సమస్య.

ఉదాహరణకి నాకు నిజాయితీగా ఉండటం ఇష్టం అనుకోండి, అందరితో అలానే ఉండటం మంచిదా లేక ఎదుటివాడు నిజాయితీపరుడు కాదు కాబట్టి వాడితో నిజాయితీగా ఉండకుండా ఎవరయితే నాతో నిజాయితీగా ఉంటున్నారో వారితో మాత్రమే నిజాయితీ గా ఉండటం మంచిదా?

ప్రస్తుతానికి మాత్రం అందరితోనూ ఒకేరకంగా మనస్సు చెప్పిన ప్రకారం ఉంటున్నాను మరి మీరేమంటారు? Say YES or NO.

Poll Results: