Saturday, April 2, 2011

మన వ్యక్తిత్వమా లేక ఎదుటి మనిషి తత్వమా?

ఎదుటి మనిషి ఎలా ఉన్నా పరవాలేదు మన మనస్సు చెప్పినట్లు నదుచుకోవటమా? లేక ఎదుటి మనిషిని బట్టి నడుచుకోవటమా అనేది నాకు ఎప్పుడూ ఎదురయ్యే మరో సమస్య.

ఉదాహరణకి నాకు నిజాయితీగా ఉండటం ఇష్టం అనుకోండి, అందరితో అలానే ఉండటం మంచిదా లేక ఎదుటివాడు నిజాయితీపరుడు కాదు కాబట్టి వాడితో నిజాయితీగా ఉండకుండా ఎవరయితే నాతో నిజాయితీగా ఉంటున్నారో వారితో మాత్రమే నిజాయితీ గా ఉండటం మంచిదా?

ప్రస్తుతానికి మాత్రం అందరితోనూ ఒకేరకంగా మనస్సు చెప్పిన ప్రకారం ఉంటున్నాను మరి మీరేమంటారు? Say YES or NO.

Poll Results:


1 comment:

  1. మంచి చేయడం ముఖ్యం మంచిగా కనిపించడంకాదు. ఒకవేళ ఆదారిలో అడ్డువచ్చేది నిజాయితీ అయితే పక్కకిగిరవాటేద్దాం.

    One should follow one's heart but yet times should be able to lead/control it too. :D

    ReplyDelete